తిరుచానూరు ఆలయంలో ఏనుగు అటాక్.. మావటికి గాయాలు!
AP: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో శ్రీనిధి అనే ఏనుగు ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది. ఊంజల్‌సేవ తర్వాత గోశాలకు తీసుకెళ్తుండగా రథ మండపం దగ్గర ఓ భక్తుడిపై దాడికి ప్రయత్నించింది. అడ్డుకునేందుకు వెళ్లిన మావటి చంద్రశేఖర్‌ను కిందపడేసి ఛాతీపై తొక్కడంతో గాయాలయ్యాయి. ఆలయంలోనే ఫస్ట్ ఎయిడ్ చేసి, ట్రీట్‌మెంట్ కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. ఏనుగు శబ్దాలకు భక్తులు భయంతో పరుగులు తీశారు. మరో మావటి ఏనుగును కంట్రోల్ చేసి గోశాలకు తీసుకెళ్లారు.


