← Back to news

రెండో రోజు నేహా బోరాను ఈడ్చుకెళ్లిన పోలీసులు

By Sahani· 1h ago· X· Delhi

CEC జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నేహా బోరా భారీ నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితా అక్రమాలపై AISA అధ్యక్షురాలు నేహా బోరా బారికేడ్లు ఎక్కి తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. నిన్న వందలాది మందిని పోలీసులు డిటైన్ చేసినా స్టూడెంట్స్ మళ్లీ రోడ్లపైకి వచ్చారు. ప్రొటెస్ట్ హీటెక్కడంతో పోలీసులు ఆమెను బలవంతంగా లాగేసి, ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

More in Current Affairs