ఆసియా గేమ్స్‌లో భారత హాకీ అంపైర్‌పై ఫిర్యాదు

ఇండియా ఇంటర్నేషనల్ హాకీ అంపైర్ గురిందర్ సింగ్ సంఘాను జపాన్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్ నుంచి వెనక్కి పంపించారు. మలేషియాకు చెందిన విమెన్ అంపైర్, మెంటరింగ్ పేరుతో సంఘా తనను అనుచితంగా తాకారని, సమ్మతి లేని శారీరక సంబంధానికి పాల్పడ్డారని కంప్లయింట్ చేశారు. హోటల్‌లో మహిళా సిబ్బందితోనూ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సంఘా ఆరోపణలను ఖండిస్తూ, ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు.
