గాంధీ జీవితం అందరికీ ఆదర్శం: తలసాని

హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్‌లో గాంధీ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి, MG రోడ్డులోని గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. శాంతియుత మార్గంలో, హింసకు తావులేకుండా బ్రిటిష్ వారిని దేశం నుంచి వెళ్లగొట్టిన ఘనత మహాత్మా గాంధీకి దక్కుతుందని చెప్పారు. గాంధీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.


