అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలన్న కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్లను వెంటనే సాల్వ్ చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ల్యాండ్ ఇష్యూస్, ఇందిరమ్మ ఇళ్లు, రోడ్డు విస్తరణపై టోటల్‌గా 203 అర్జీలు వచ్చాయి. జిల్లా సెంటర్‌లో 119, డివిజన్‌లో 3, మండలాల్లో 81 అప్లికేషన్లు అందినట్లు ఆఫీసర్లు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో అడిషనల్ కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.



