గర్భిణుల హైరాక్స్ ట్రెండ్!

మనదేశంలో గర్భం దాల్చినవాళ్లు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. సెలబ్రిటీలు ఏడు నెలల గర్భంతో ఉండి ఆడుతూ, బరువులు ఎత్తుతూ ఫిట్నెస్ రొటీన్ పూర్తి చేస్తుండటంతో సామాన్య గర్భిణులు కూడా ఇలాంటి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే క్రమంలో కసరత్తులుచేస్తున్నారు. తాజాగా గర్భిణుల హైరాక్స్ కొత్త ఫిట్నెస్ ట్రెండ్ అయి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
