← Back to news

స్కూలు స్డూడెంట్స్తో మల్లన్న ముచ్చట

By నిమ్మనగంటి అనిల్ బాబు· 51m ago· Nehru Nagar, Khammam (Rural), Khammam
స్కూలు స్డూడెంట్స్తో మల్లన్న ముచ్చట

బీసీ రాజ్యాధికార పాదయాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలానికి చెందిన కందనెల్లికి చేరుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతులు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. "విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే బలమైన పునాది" అని ఆయన అన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

స్కూలు స్డూడెంట్స్తో మల్లన్న ముచ్చట
స్కూలు స్డూడెంట్స్తో మల్లన్న ముచ్చట

More in Local