అరకు స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో పోటీకి కాంగ్రెస్ సిద్ధమని ఇన్చార్జి శెట్టి గంగాధర్ స్వామి తెలిపారు. గిరిజన హక్కులు, ఐదవ షెడ్యూల్, పీసా, 1/70 చట్టాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.



