← Back to news

LPG షాక్‌.. సిలిండర్‌ ధరలు పెంపు!

By Anusha· 2h ago
LPG షాక్‌.. సిలిండర్‌ ధరలు పెంపు!

దసరా పండుగ వస్తున్న టైంలో కమర్షియల్‌ LPG సిలిండర్‌ ధరలు పెరిగాయి. అక్టోబర్‌ 1 నుంచి 19 కేజీల సిలిండర్‌పై 71 రూపాయల 50 పైసలు పెంచడంతో ఢిల్లీలో ధర 2,810 రూపాయలకి చేరింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. అయితే 14.2 KGల డొమెస్టిక్‌ LPG ధరల్లో మార్పు లేదు. ఢిల్లీలో 942 రూపాయలు, ముంబైలో 941 రూపాయల 50 పైసలు, చెన్నైలో 957రూపాయల 50పైసలు, కోల్‌కతాలో 968 రూపాయలు, హైదరాబాద్‌లో 994 రూపాయలుగా కొనసాగుతున్నాయి.

More in Current Affairs