← Back to news

బండ్లగూడ RTOలో ACB రైడ్స్.. ముగ్గురు సస్పెండ్!

By Mahesh· 1h ago· TG
బండ్లగూడ RTOలో ACB రైడ్స్.. ముగ్గురు సస్పెండ్!

TG: బండ్లగూడ RTO ఆఫీస్‌లో ACB అధికారులు ఈరోజు సడన్‌గా రైడ్స్ చేశారు. వాహనదారుల నుంచి వచ్చిన కంప్లైంట్స్‌తో ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. సరైన డాక్యుమెంట్లు ఉన్నా ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ అరుణ్ చాంబర్‌లో క్యాష్ కౌంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ACB అధికారులు ఫైల్స్, రికార్డులను చెక్ చేశారు. ఈ ఇష్యూలో MVI భీమ్ సింగ్, RTO రామచందర్, కానిస్టేబుల్ అరుణ్‌ను రవాణా శాఖ సస్పెండ్ చేసింది.

More in TG

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్
TG· 2h ago

మల్కాపూర్ బడి నిండా సమస్యలు: సృజన యాదవ్

TG: ఆదివాసీ గ్రామాల్లోని పిల్లల పరిస్థితులు చూస్తే బాధగా ఉందని సృజన యాదవ్ అన్నారు. TPF<a href="https://www.theclearcutnews.com/n/Aq6od2X"> విద్యా బస్సుయాత్ర</a>లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మల్కాపూర్‌లో ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు తరగతులు ఉన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లు, రెండు గదులు ఉండగా ఒక గదిలో సామగ్రి ఉండటంతో పిల్లలు వరండాలో కూర్చొని చదువుకుంటున్నారని తెలిపారు. నాలుగు బాత్రూమ్‌లలో మూడు పనిచేయడం లేదని, నల్లాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇద్దరు టీచర్లలో ఒకరు సెలవులో ఉంటే ఒక్క టీచర్‌తోనే పాఠశాల కొనసాగుతోందన్నారు.