‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లు పెంపుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

TG: ‘ది ప్యారడైజ్’ స్పెషల్ షోకు తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 23న సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ షో ఉండనుంది. టికెట్ ధరను 500 రూపాయలుగా ఫిక్స్ చేశారు. అలాగే 27 వరకు టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌ల్లో 95, సింగిల్ స్క్రీన్‌ల్లో 48 రూపాయల వరకు అదనంగా చార్జ్ చేసుకోవచ్చు. 28 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ పెంపు వరుసగా 45, 23 రూపాయలుగా ఉంటుంది. ఫిల్మ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం నిర్మాత కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.


