లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినవారిపై వివేక్ భగత్ ఎదురు కేసు

జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన కవరేజ్ టైంలో తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన మహిళా విలేకరి, మరికొందరిపై ఢిల్లీ ACP వివేక్ భగత్ ఎదురు కేసు వేశారు. డ్యూటీ టైంలో ఆ మహిళ తనపై కులవివక్ష కామెంట్స్ చేసి అవమానించారని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. వివేక్ షెడ్యూల్డ్ కులానికి చెందినవారు. తనపై అబద్ధపు లైంగిక వేధింపుల ఆరోపణలు మోపి మానసికంగా వేధించారని, ప్రతిష్టకు భంగం కలిగించారని ACP కంప్లైంట్లో రాశారు.

