దుష్యంత్ గౌతమ్కు పదవి.. అంకితా భండారి తల్లిదండ్రుల ధర్నా
2022లో ఉత్తరాఖండ్లో హత్యకు గురైన 19 ఏళ్ల అంకితా భండారి తల్లిదండ్రులు ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ధర్నా చేస్తున్నారు. తమ కూతురి హత్యకేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న దుష్యంత్ గౌతమ్ను సిక్కిం గవర్నర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు గవర్నర్గా నియమించకూడదని కోరుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాడ్రా వారిని కలిసి ఓదార్చారు. రాహుల్ గాంధీ కూడా అక్కడికి వచ్చి వారిలో మాట్లాడారు.


