రష్యాలో వింత ఇన్ఫెక్షన్

రష్యా.. సైబీరియాలోని ఇర్కుట్స్క్‌కి దగ్గర్లో ఉన్న షెలెఖోవ్‌లో ప్లేగు కలకలం రేగింది. అక్కడి యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 28 ఏళ్ల మహిళా ల్యాబ్ టెక్నీషియన్ డారియా షిపిలోవా వింత న్యుమోనియాతో చనిపోయారు. ఆమెకు ప్లేగ్ సోకిందనే భయాలు వ్యాపించాయి. ఇది ఎలాంటి వ్యాధో తెలియదన్న రష్యా ఆరోగ్య అధికారులు.. పరిస్థితి కంట్రోల్ లోనే ఉందన్నారు. ఈ మరణం తర్వాత 200 మంది డాక్టర్లు, మెడికల్ సిబ్బందిని టెస్ట్ చేస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్‌లో క్వారంటైన్ విధించారు. ప్రజలు టెన్షన్ పడొద్దని అధికారులు కోరారు.



