← Back to news

పోలవరం నుంచి భారీగా నీటి విడుదల

By A.Ajay· 4h ago
పోలవరం నుంచి భారీగా నీటి విడుదల

AP: గోదావరి వరద ప్రభావం పోలవరం ప్రాజెక్టుపైనా కనిపిస్తోంది. నిన్న పోలవరం స్పిల్‌వే నుంచి 8,75,512 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీటిని ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి పంపిస్తున్నారు. పోలవరం వద్ద నీటిమట్టం పెరగడంతో పట్టిసీమ శివక్షేత్రం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో ఆలయానికి రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు కృష్ణా, పశ్చిమ డెల్టాల సాగునీటి అవసరాల కోసం పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాలువకు 7,788 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

More in AP