"జ్ఞానేష్".. APలో కాంగ్రెస్ ర్యాలీ!
AP: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలంటూ.. మస్తాన్ వలి, JD సీలం వంటి నేతలు.. విజయవాడలో ర్యాలీ, నిరసనలు చేపట్టారు. జ్ఞానేష్ కుమార్ భారత ప్రజాస్వామ్య సమగ్రతను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు, బ్యానర్లు ప్రదర్శించారు. "జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి" అని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ "ఓటు చోరీ" పేరుతో దేశవ్యాప్త ఆందోళనలు చేస్తోంది. అందులో భాగంగా.. ఏపీలో ఈ ప్రొటెస్ట్ జరిగింది.



