← Back to news

బండరాయిలో వినాయకుడి రూపం.. భక్తుల సందడి

By Bala· 1h ago· TG
బండరాయిలో వినాయకుడి రూపం.. భక్తుల సందడి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో సికింద్లాపూర్ అడవిలోని లక్ష్మీనృసింహస్వామి కొండపై భారీ బండరాయిలో కనిపించిన రాతి శిలను మహా వినాయకుడి రూపంగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు ధనుంజయ శర్మ, పూజారి విద్యాకర్ చారి పూజలు చేశారు. ఈ విశేషాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

More in Politics