← Back to news

అమెరికాలో గుండెపోటుతో నగర వాసి మృతి!

By Balasaidul· 1h ago· TG
అమెరికాలో గుండెపోటుతో నగర వాసి మృతి!

అమెరికాలో తెలుగు కమ్యూనిటీలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ బేగంపేటకు చెందిన MBA సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రావుల పవన్ సాయి వంశీ (36) గుండెపోటుతో మృతి చెందారు. ఈ నెల 9న కాలిఫోర్నియాలోని నివాసంలో పిల్లలతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురాగా, బన్సీలాల్‌పేటలో అంత్యక్రియలు నిర్వహించారు.

More in Politics