← Back to news

ప్రజావాణిలో 36 ఫిర్యాదులు.. సీపీ స్పందన

By Thallapally Raju· 1h ago· Subhash Nagar, Nizamabad Rural, Nizamabad
ప్రజావాణిలో 36 ఫిర్యాదులు.. సీపీ స్పందన

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి జరిగింది. సీపీ పి. సాయి చైతన్య 36 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలు విని, చట్ట ప్రకారం త్వరగా పరిష్కరించాలని సీఐలు, ఎస్ఐలను ఆదేశించారు. ప్రజలు మధ్యవర్తులు, పైరవీలు ఆశ్రయించకూడదని, నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

ప్రజావాణిలో 36 ఫిర్యాదులు.. సీపీ స్పందన
ప్రజావాణిలో 36 ఫిర్యాదులు.. సీపీ స్పందన

More in Local