దళిత సర్పంచ్‌కు వేధింపులు.. చర్యలకు KVPS డిమాండ్

వికారాబాద్ జిల్లా యాలాల మండలం ఎనికెపల్లి గ్రామ దళిత మహిళా సర్పంచ్ స్వరూపను వేధింపులకు గురిచేస్తున్నారు. పంచాయతీ నిధులను అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు కార్యదర్శి శేఖర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. దళిత మహిళా ప్రజాప్రతినిధిపై వేధింపులు, నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.



