రీచార్జ్ ప్లాన్లు, STVలను ప్రముఖంగా ప్రదర్శించాలి

తప్పనిసరి చేసిన రీచార్జ్ ప్లాన్లు, స్పెషల్ టారిఫ్ వోచర్లు (STV) వివరాలను వినియోగదారులకు సులభంగా కనిపించేలా ఉంచాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, కస్టమర్ కేర్ కేంద్రాలు, విక్రయ కేంద్రాల్లో వీటిని ప్రముఖంగా ప్రదర్శించాలని సూచించింది. ప్లాన్ల వివరాలు సులభంగా అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బంది పడుతున్న సంధర్భంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. 30 రోజుల్లోగా అమలు చేయాలని ఆదేశించింది.



