← Back to news

కేతిరెడ్డి అరెస్ట్.. తాడిపత్రిలో హైటెన్షన్

By DK· 12 Jun 2026· Dishadaily· అనంతపురం జిల్లా
కేతిరెడ్డి అరెస్ట్.. తాడిపత్రిలో  హైటెన్షన్

AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా YCP నాయకులు 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. తాడిపత్రిలో మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టగా, TDP విజయోత్సవ బైక్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నడిరోడ్డుపై కూర్చుని వైసీపీ మాజీ MLA కేతిరెడ్డి పెద్ది ఆందోళన చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురానికి తరలించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.

More in Politics