← Back to news

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

By Bejjanki· 58m ago· Bejjanki, Bejjanki, Siddipet
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల చౌరస్తా సమీపంలో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. బెజ్జంకికి చెందిన తిప్పారపు సురేష్ (45) ద్విచక్ర వాహనంపై కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం 3:01amకి చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య రజిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More in Local