← Back to news

దిల్‌సుఖ్‌నగర్‌ ఆలయంలోకి దుండగుడు.. పూజారిపై దాడి

By Prashanth· 1h ago· Telangana

TG: హైదరాబాద్‌ నగరం దిల్‌సుఖ్‌నగర్‌లో సంతోషిమాత ఆలయంలోకి ఓ ముస్లిం వ్యక్తి ప్రవేశించి పూజారిపై దాడి చేశాడు. అమ్మవారి విగ్రహంపై కర్రలు విసిరినట్లు సమాచారం. వెంటనే స్థానికులు అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మానసిక అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆలయం వద్ద భద్రత పెంచారు.

More in TG