కారు-ఆటో ఢీ.. ఒకరు మృతి!

పోలవరం జిల్లా విఆర్ పురం మండలం అడివి వెంకన్న గూడెం వద్ద బుధవారం కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సోముల గూడెంకు చెందిన మీడియం సత్యనారాయణ (60) మృతి చెందారు. చొప్పల్లికి చెందిన ఊర్మ లక్ష్మి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను 108లో చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.





