← Back to news

తెలంగాణ విద్యారంగం ICUలో ఉంది: TPF

By Vishi· 10h ago
తెలంగాణ విద్యారంగం ICUలో ఉంది: TPF

TG: తెలంగాణ విద్యా రంగాన్ని అత్యవసర ప్రాధాన్యంగా తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్(TPF) సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాసింది. ‘తెలంగాణ విద్యారంగం ఐసీయూలో ఉంది. వెంటనే వైద్యం అవసరం’ అని లెటర్‌లో చెప్పారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్యకు బడ్జెట్‌లో 6.5 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామని, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని, ప్రైవేట్ ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇంకా అమలు కాలేదని గుర్తు చేశారు.

More in TG