← Back to news

రాహుల్ గాంధీ నిరసనకు మద్దతుగా జగ్గారెడ్డి దీక్ష!

By Mahesh· 5h ago· TG
రాహుల్ గాంధీ నిరసనకు మద్దతుగా జగ్గారెడ్డి దీక్ష!

TG: CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ చేపట్టిన <a href="https://www.theclearcutnews.com/n/FSTNmBx">నిరసనకు మద్దతుగా</a> TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డిలో దీక్షకు కూర్చోనున్నారు. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ ఎన్ని రోజులు రోడ్డుపై నిరసన చేస్తే.. అన్ని రోజులూ తాను కూడా దీక్ష చేస్తానని చెప్పారు. ఎలక్షన్ సిస్టమ్‌కు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

More in TG