PM మోడి ఫ్యామిలీ లెగసీతో రాజకీయాల్లోకి రాలేదు: బండి సంజయ్
TG: PM నరేంద్ర మోదీపై జరుగుతున్న రాజకీయ ప్రచారాన్ని నమ్మే ముందు ఆయన జీవితాన్ని చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీ రాజకీయాల్లోకి ఫ్యామిలీ లెగసీతో రాలేదని, సంపద లేదా బిజినెస్ సామ్రాజ్యం కోసం పవర్‌ను వాడుకోలేదని కామెంట్స్ చేశారు. దేశ సేవ, పేదల సేవే మోదీ లక్ష్యమని అన్నారు. 2014కు ముందు, ఇప్పుడు భారత్ పరిస్థితిని పోల్చి చూడాలని చెప్పారు. 'భారతదేశమే మోదీ కుటుంబం.. దేశ సేవే ఆయన లైఫ్ మిషన్’ అని <a href="https://x.com/bandisanjay_bjp/status/2107808142658884026">బండి సంజయ్ అన్నారు.</a>



