ఓట్ల చోరీపై పోరాటం.. మమతా బెనర్జీ
న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన INDIA కూటమి సమావేశంలో మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పెద్ద స్కామ్ జరిగిందని, బీజేపీ, ఎలక్షన్ కమిషన్ కలిసి పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఓట్లను చోరీ చేశారని, EVMలను తగలబెట్టి, కౌంటింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే 'Vote Theft' పై భారీ ఉద్యమం చేస్తామని చెప్పారు.



