← Back to news

AIకి వ్యతిరేకంగా రోబోల ధర్నా

By Anusha· 8h ago· Hungarianconservative
AIకి వ్యతిరేకంగా రోబోల ధర్నా

AI నియంత్రణ, ఆటోమేషన్‌ వల్ల మనుషుల జాబ్స్‌కు వస్తున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలాండ్‌లో 30 రోబోలు వీధుల్లో నిరసన చేపట్టాయి. ‘డెమోక్రటిజం’(Democratism) అనే సామాజిక సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. వార్సాలోని పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయం బయట జరిగిన ఈ వినూత్న నిరసనలో హ్యూమనాయిడ్ రోబోలు, రోబో కుక్కలు పాల్గొన్నాయి. రోబోలు జెండాలూపుతూ, ర్యాలీ చేస్తూ, లౌడ్‌స్పీకర్ల ద్వారా నినాదాలు చేశాయి. AIపై మరింత కఠినమైన రూల్స్ తీసుకురావాలని రోబోలు డిమాండ్ చేశాయి.

More in International