వరదల తర్వాత నేపాల్‌కు భూకంపం

ఇప్పటికే భారీ వరదలు, కొండచరియల విరిగిపడిన ఘటనలతో ఇబ్బందులు పడుతున్న నేపాల్‌కు మరో ప్రకృతి విపత్తు ఎదురైంది. మంగళవారం రాత్రి ముస్తాంగ్ జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాత్రి 9.53 గంటలకు భూమి కంపించగా మానాంగ్, డోల్పా, మయాగ్డి జిల్లాల్లోనూ భూమి కంపించింది. ఇటీవల సంభవించిన వరదల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సందర్భంలో ఈ భూకంపం ప్రజల్లో మరింత ఆందోళన కలిగించింది. భూకంపం వల్ల ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.



