ఒక్కో కథ ఒక్కో అద్భుతం.. ‘జాజిపూల పరిమళం’

రచయిత్రి షహీదా అనేది అసలు పేరో, కలం పేరో తెలియదు. ఉద్యమ జీవితంపై ఆమె రాసిన 33 కథలను ‘జాజిపూల పరిమళం’ పుస్తకంగా తీసుకొచ్చారు. ఒక్కో కథ ఒక్కో అద్భుతం. ఈ కథలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఉత్సాహపరుస్తాయి. కొత్త ఎరుకను కలిగిస్తాయి. కొత్త జీవితాలను చూపిస్తాయి. దాదాపు 50 ఏళ్ల జీవితానుభవాలని షహీదా ఇందులో రాశారు. వర్గపోరాటంలో స్త్రీల దృష్టి కోణం నుంచి రాసిన ఈ కథలన్నీ తప్పకుండా చదవాల్సినవి. పుస్తకం ఖరీదు రూ.150. కొనేందుకు <a href="https://logilitelugubooks.com/book/jajipoola-parimalam-telugu-book-by-shahida-shaheeda-kathalu">లింక్</a>.



