← Back to news

ప్రభుత్వ స్కూళ్లపై రోడ్ మ్యాప్ కావాలి: ఆకునూరి మురళి

By A.Ajay· 56m ago
ప్రభుత్వ స్కూళ్లపై రోడ్ మ్యాప్ కావాలి: ఆకునూరి మురళి

TG: తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ విద్యా బస్సుయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్నగర్ పర్యటనలో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడారు. రాష్ట్రంలోని స్కూళ్లకు సరిపడా టీచర్లు, బస్సులు, మంచి ఫెసిలిటీస్ కల్పించి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలని కోరారు. ఇలాంటి మార్పుల కోసం ప్రభుత్వం చట్టం, రోడ్ మ్యాప్, టైమ్ ఫ్రేమ్ రూపొందించాలని అన్నారు. నిర్ణయించిన సమయంలోగా ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపరిచేలా ప్రత్యేకంగా మానిటర్ చేయాలని సూచించారు.

More in TG