22A బ్యాన్ లిస్ట్‌పై CM బిగ్ డెసిషన్.. 30 రోజుల్లో క్లియర్

TG: రాష్ట్రంలో 22A బ్యాన్ లిస్ట్‌లో ఉన్న నిరుపేదల ఆస్తుల సమస్యలను 30 రోజుల్లో సాల్వ్ చేసేలా చర్యలు తీసుకుంటామని CM రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం CCLA, న్యాయ, స్టాంప్స్-రిజిస్ట్రేషన్స్ శాఖల అధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ULC ల్యాండ్స్, ప్రభుత్వ లేఅవుట్లు, సింగరేణి కోల్‌బెల్ట్, GO 59, GO 118, అసైన్డ్ భూములు, ఇందిరమ్మ ఇళ్లు, నాలా ఛార్జీలు, అక్రమ లేఅవుట్లు, లీజ్‌హోల్డ్ ఆస్తులు వంటి 12 అంశాలపై పరిష్కార చర్యలు చేపడతామని సిఎం తెలిపారు.



