ఒకే టీచర్.. రెండు రూముల్లో స్కూల్, అంగన్‌వాడీ!

TG: ఖమ్మం జిల్లా.. కొణిజర్ల మండలం.. ఎల్లన్నగర్‌లో సింగిల్ టీచర్ స్కూల్ ఉండటంపై రిటైర్డ్ IAS ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్‌కు ఉన్న రెండు రూముల్లోనే పాఠశాలతో పాటూ అంగన్‌వాడీ కూడా నడుస్తోందని తెలిపారు. 5వ తరగతి తర్వాత పిల్లలు ఎక్కడ చదవాలన్నదే సమస్యగా మారిందనీ.. ప్రైవేట్ స్కూళ్ల బస్సులు కూడా గ్రామానికి రావడం లేదని అన్నారు. 2026లోనూ ఇలాంటి స్కూల్ ఉండటం అన్యాయమనీ.. ఈ పరిస్థితిని.. ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే ఇక్కడ బస చేస్తున్నామని మురళి చెప్పారు.



