రేకుల షెడ్డు ఇంటికి 47 వేల రూపాయల కరెంట్ బిల్లు!

AP: కోనసీమ జిల్లా చీకురుమిల్లిపేటలో జయలక్ష్మి అనే ఒంటరి మహిళ ఇంటికి 47,063 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. జనవరిలో 4,885 యూనిట్ల కరెంట్ వాడినట్లు బిల్లులో చూపించారు. బిల్లు కట్టలేదని అధికారులు కనెక్షన్ కట్ చేశారు. ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలుగా కరెంట్ లేకుండా ఉంటున్నామని, మనవరాళ్లకు తల్లికి వందనం డబ్బులు కూడా రావడం లేదని చెప్పారు. బిల్లును చెక్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.




