← Back to news

అనంతపురంలో రైతులపై దౌర్జన్యం.. రిసోనియాపై చర్యలకు డిమాండ్

By Jagadish· 6h ago
అనంతపురంలో రైతులపై దౌర్జన్యం.. రిసోనియాపై చర్యలకు  డిమాండ్

అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం శ్రీధర్ ఘట్టలో టెన్షన్. విద్యుత్ టవర్ల నిర్మాణం కోసం రైతులపై రెవెన్యూ, పోలీస్ అధికారులు దౌర్జన్యం చేశారు. పేద రైతులు అమర్, రామసుబ్బమ్మ, లక్ష్మీదేవి, సుంకన్న తదితరులపై 150 మందికి పైగా పోలీసులు మోహరించి అరెస్ట్ చేశారు. సాగు చేసిన మొక్కజొన్న పంటను జేసీబీలతో ధ్వంసం చేశారు. ఈ ఘటనను AP రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, మాట్లాడుతూ బాధ్యులైన అధికారులు, విద్యుత్ టవర్ల నిర్మాణ సంస్థ రిసోనియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in Politics