← Back to news

ఏచూరిని తలుచుకున్న దేశం.. ఘన నివాళి

By Jagadish· 6h ago
ఏచూరిని తలుచుకున్న దేశం.. ఘన  నివాళి

ఃసీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సభలు దేశమంతా జరిగాయి. ఢిల్లీ ఏకె గోపాలన్ భవన్ మొదలుకుని వామపక్ష అభిమానులున్న ప్రతీచోట ఇలాంటి సభలు జరిగాయి. అణగారిన వర్గాల హక్కుల కోసం, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో, లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణలో ఏచూరి చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా జేఎన్‌యూ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఆయన చూపిన సిద్ధాంత పటిమ భావితరాలకు స్ఫూర్తిదాయకమని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎంఎబేబి కొనియాడారు.

More in Politics