← Back to news

దేశంలోనే తొలి BC రక్షణ చట్టం..! త్వరలో..

By Jagadish· 6h ago
దేశంలోనే తొలి BC రక్షణ చట్టం..!  త్వరలో..

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని గొల్లపూడి బీసీ భవన్‌లో బిసి రక్షణ బిల్లు ముసాయిదాపై సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కులం, వృత్తి పేరుతో దూషించినా, సంఘ బహిష్కరణకు గురిచేసినా కఠిన శిక్షలు పడతాయి. జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 2 నెలల్లో విచారణ పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించారు. బీసీల ఆత్మగౌరవ జీవనమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

More in Politics