ఇవాళ, రేపు ప్రజావేదిక కార్యక్రమం రద్దు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయం NTR భవన్‌లో ప్రతిరోజూ నిర్వహించే ప్రజా వేదిక కార్యక్రమాన్ని అక్టోబర్ 1, 2 తేదీల్లో రద్దు చేశారు. TDP అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ జరగనుంది. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రజా వేదిక నిర్వహించరు.


