← Back to news

ఎమ్మార్పీఎస్ జడ్చర్ల మండల అధ్యక్షుడిగా యాదయ్య

By Surender Panuganti· 1h ago· Jadcherla, Jadcherla, Mahabubnagar
ఎమ్మార్పీఎస్ జడ్చర్ల మండల అధ్యక్షుడిగా యాదయ్య

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ కళాభవన్‌లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న MSF జాతీయ ప్రతినిధుల మహాసభ, అక్టోబర్ 17న నిర్వహించే ఛలో అమరావతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జడ్చర్ల మండల నూతన అడహక్ కమిటీ అధ్యక్షుడిగా పోలేపల్లి గ్రామానికి చెందిన కందూరి యాదయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

More in Local