జర్నలిస్టులు డిటైన్.. అమిత్ షాకు CPI ఎంపీ లేఖ!

ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై C.P.I MP పి. సంతోష్ కుమార్ ఫైర్ అయ్యారు. ఈ చర్యలను ఆపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) గుర్తింపు కార్డు లేదనే కారణంతో జర్నలిస్టులను అడ్డుకోవడం సరికాదన్నారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై వేధింపులపై ఇన్వెస్టిగేషన్ జరిపించాలని కోరారు.


