భూమికి అనారోగ్యం!

2026 స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ నివేదిక ప్రకారం, భూమి వాతావరణ పరిస్థితులను తెలిపే 16 ముఖ్యమైన సూచికల్లో 7 ప్రమాదకర స్థాయికి చేరాయి. 2025లో శిలాజ ఇంధనాల వినియోగం 0.9 శాతం పెరిగింది. దీంతో కార్బన్ ఉద్గారాలు తొలిసారిగా 41 గిగాటన్నులు దాటినట్లు నివేదిక తెలిపింది. కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ స్థాయులు కూడా పెరిగాయి. భూతాపం పెరుగుతుండటంతో వాతావరణంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెరుగుతున్నా, భూమిని కాపాడేందుకు మరిన్ని చర్యలు అవసరమని నివేదిక హెచ్చరించింది.



