← Back to news

వరదల్లో చిక్కిన 12 మందిని కాపాడిన IAF

By Sharmila· 1h ago

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జగదల్‌పూర్ దెగ్గరలో 12 మంది వరదల్లో చిక్కుకున్నారు. డోంగాఘాటి గ్రామం దెగ్గర ఇంద్రావతి నది ఉత్తర ఒడ్డున ఓ గుడిసె పైకప్పుపై మహిళలు, చిన్నారులు రాత్రంతా ఉన్నారు. గుడిసె కూలిపోయే ప్రమాదం ఉండటంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌ను గాల్లో నిలిపి గరుడ్ కమాండోలను పైకప్పుపైకి దించారు. తర్వాత ఒక్కొక్కరినీ హెలికాప్టర్‌లోకి ఎక్కించి మొత్తం 12 మందిని సురక్షితంగా కాపాడారు.

More in National