← Back to news

డిటెన్షన్‌పై చర్చ.. పోలీసుల క్లారిటీ

By Lokesh· 1h ago· X
డిటెన్షన్‌పై చర్చ.. పోలీసుల క్లారిటీ

జంతర్‌ మంతర్‌లో జరిగిన ప్రొటెస్టుల్లో మహిళా నిరసనకారులు, జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలు వాస్తవం కాదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. మహిళలను కేవలం మహిళా పోలీసులే అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. పురుష నిరసనకారులను కూడా నిబంధనల ప్రకారమే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఆరోపణలపై విచారణ కోసం కేసులను క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించినట్లు DCP NewDelhi X అకౌంట్లో పోస్ట్ చేసారు.

More in National