← Back to news

కరెంట్‌ సమస్యపై రైతుల ఆగ్రహం.. సబ్‌స్టేషన్‌ ముట్టడి

By Prashanth· 2h ago· Kamareddy

TG: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం భగీరథపల్లిలో కరెంట్‌ కోతలు, Low Voltageతో కరెంటు వస్తుందని రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్‌ సరఫరా సరిగ్గా రావడం లేదంటూ.. సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. లోవోల్టేజ్‌ కారణంగా మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులతో వాగ్వాదం జరగడంతో సబ్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు మోహరించారు.

More in TG