SIR పనులు చేస్తున్న సిబ్బందికి డబ్బులు ఇవ్వాలి!

TG: SIR పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి డబ్బులు ఇవ్వాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA) కోరింది. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలించడం, జాబితాలో మార్పులు చేయడం వంటి పనులను సిబ్బంది చేస్తున్నారని తెలిపింది. ఈ విషయంపై TRESA ప్రతినిధులు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి తమ సమస్యను చెప్పారు. సిబ్బందికి డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు TRESA తెలిపింది.



