← Back to news

అంతర్రాష్ట్ర బదిలీలకు అవకాశం కల్పించండి

By A.Ajay· 3h ago
అంతర్రాష్ట్ర బదిలీలకు అవకాశం కల్పించండి

తెలంగాణలో పనిచేస్తున్న AP స్థానికత కలిగిన 1,369 మంది ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపేందుకు అవకాశం కల్పించాలని 'TGEJAC' సీఎం రేవంత్‌రెడ్డిని కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. AP నుంచి తెలంగాణకు రావాలని 891 మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని తెలిపింది. గతంలో 2,372 మంది AP ఉద్యోగులు తెలంగాణకు శాశ్వత బదిలీపై వచ్చారని గుర్తుచేసింది. అర్హతలు, వ్యక్తిగత పరిస్థితులను పరిశీలించి, ఇరు రాష్ట్రాల అంగీకారంతో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

More in TG