5వ వార్డులో ప్రత్యేక ఆధార్ డ్రైవ్

గుంటూరు జిల్లా తాడేపల్లి 5వ వార్డులో యానాది కాలనీ ప్రజల ఆధార్, రేషన్ కార్డు తదితర సమస్యల పరిష్కారానికి శనివారం ప్రత్యేక ఆధార్ డ్రైవ్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డ్రైవ్‌లో కొత్తగా ఆధార్ నమోదు, ఆధార్ వివరాల అప్‌డేట్, e-KYC, బయోమెట్రిక్ అప్‌డేట్ సేవలు అందించారు. రేషన్ కార్డు సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హులకు కుల ధ్రువీకరణ పత్రాల సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.


