అరకులో భగత్‌సింగ్ జయంతి.. ఘన నివాళి!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో భగత్‌సింగ్ జయంతి జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివాసీ గిరిజన సంఘం, SFI ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన సంఘం నాయకులు కిల్లో సురేంద్ర, పొద్దు బలదేవ్, కిండంగి రామారావు, SFI నాయకుడు పి.జయరాం మాట్లాడారు. భగత్‌సింగ్ ఆశయాలు, దేశభక్తిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



